హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

91 వార్డులకు 168 నామినేషన్‌లు దాఖలు

కోనసీమ: జిల్లాలో 3 మున్సిపాలిటీల పరిధిలో శనివారం నాటికి 91 వార్డులకు గాను 168 నామినేషన్‌లు దాఖలు అయ్యాయని ఎన్నికల అధికారులు తెలిపారు. అమలాపురం మున్సిపాలిటీలో 54 నామినేషన్‌లు, రామచంద్రపురం పురపాలక సంఘంలో వార్డు కౌన్సిలర్ స్థానాలకు 83 నామినేషన్‌లు, ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో 26 నామినేషన్‌లు దాఖలు అయ్యాయని తెలిపారు.