హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెండ్రోజుల్లో లక్షకుపైగా భక్తుల దర్శనం

నిర్మల్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 7వ రోజు అమ్మవారు కాళరాత్రి అలంకారంలో దర్శనమిచ్చారు. శుక్రవారం 78 వేలు, శనివారం 45 వేల మంది దర్శించుకున్నారు. 2 రోజుల్లో కలిపి మొత్తం 1.23లక్షల మంది దర్శించుకున్నారని, 2219 అక్షరాభ్యాసాలు జరిగాయని ఆలయ ఈవో అంజనాదేవి వెల్లడించారు.