PDPL: ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆకాంక్షించారు. శరన్నవరాత్రుల సందర్భంగా శనివారం రాత్రి రామగుండంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాలను పార్టీ నేతలతో కలిసి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. కార్మికులు, రైతులు, శ్రామికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉండాలని వేడుకున్నారు.
తెలంగాణ
'ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి'


