హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దుర్గమ్మ అమ్మవారికి మంత్రి ప్రత్యేక పూజలు

అన్నమయ్య: చిన్నమండెం టౌన్ లోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శనివారం తన సతీమణి హరితమ్మతో కలిసి కుటుంబ సమేతంగా సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. ఆలయ అర్చకులు మంత్రి దంపతులకు స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు ఇచ్చారు.