హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుంట కట్ట వద్ద చిరుత సంచారం.. రైతుల్లో టెన్షన్

NZB: మోస్రా మండలం తిమ్మాపూర్ కుంట కట్ట కింద చిరుత సంచరిస్తున్నట్లు ఆయకట్టు రైతులు తెలిపారు. పొలం వద్దకు వెళ్తున్న ఓ రైతు చిరుతను గమనించి సెల్‌ఫోన్‌లో ఫొటో తీశారు. దీంతో నిత్యం పొలాలకు వెళ్లే రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలోనూ అటవీ ప్రాంతంలో చిరుత సంచారం ఉన్నట్లు అధికారులు తెలిపిన నేపథ్యంలో రైతులు, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.