హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఫ్లెక్సీలు, విద్యుత్ స్తంభాలు తొలగించాలి'

MLG: ములుగు పత్తిపల్లి రోడ్డులో తోపుకుంటకు వెళ్లే మార్గంలో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న ఫ్లెక్సీలను తొలగించి, రహదారి మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాలను మార్చాలని బీజేపీ జిల్లాఅధ్యక్షుడు సిరికొండ బలరాం డిమాండ్ చేశారు. ఈ మేరకు టౌన్ ప్లానింగ్ అధికారి కిరణ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. బతుకమ్మకు వెళ్లేమహిళలు, వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకోవాలన్నారు.