హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కోటి రూపాయల నగదుతో దుర్గాదేవి అలంకరణ

NZB: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని నల్ల పోచమ్మ కమాన్ వద్ద భ్రమరాంబిక యూత్ ఆధ్వర్యంలో దుర్గాదేవి అమ్మవారిని కోటి రూపాయల నగదుతో దివ్యంగా అలంకరించారు. ఈ విశేష అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.