హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో 21 నుంచి ఎన్నికల నామినేషన్లు: కలెక్టర్

నంద్యాల జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఈ నెల 21 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుందని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. నవంబర్ 3న పోలింగ్, 5న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తామని వెల్లడించారు. కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో అధికారులతో మాట్లాడుతూ.. ఎన్నికల మాన్యువల్‌ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.