ఏలూరు: కార్పొరేషన్, నూజివీడు, జంగారెడ్డిగూడెం పురపాలక ఎన్నికలకు ఈనెల 18 వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. 19న పరిశీలన, 21న ఉపసంహరణతో పాటు తుది జాబితా విడుదల చేయనున్నారు. ఈనెల 28న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు ఉంటుందని పేర్కొన్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో సిబ్బందికి శిక్షణ ఇచ్చి గట్టి భద్రత ఏర్పాటు చేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో గట్టి బందోబస్త్


