జంతర్ మంతర్ నిరసనల్లో కొంతమంది మహిళలపై పలు చోట్ల పోలీసులు జరిపిన లైంగిక వేధింపులు, అనుచిత ఘటనలపై ఢిల్లీలో మహిళా, విద్యార్థి సంఘాలు నిరసన బాట పట్టాయి. మహిళా ఉద్యమకారులతో అసభ్యకరంగా ప్రవర్తించిన పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ACP తనను అసభ్యకరంగా తాకాడని యువ మహిళా పాత్రికేయురాలు ఆరోపించగా.. తిరిగి ఆమెపైనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం ఏమిటని నిలదీశారు.
వార్తలు
లైంగిక దాడులపై ఢిల్లీలో మహిళల నిరసన


