NRML: భైంసా పట్టణంలోని 6వ వార్డు గోపాల్నగర్, ఏపీనగర్లో కాలువల నిర్మాణం కోసం నాలుగు నెలల క్రితం తవ్వకాలు చేపట్టి వదిలేశారు. పనులు ప్రారంభించకపోవడంతో గుంతల్లో చెత్త, మురుగు చేరి పందులకు ఆవాసాలుగా మారాయి. రాత్రివేళల్లో కాలువల్లో పడి పలువురు ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ
నాలుగు నెలలుగా అసంపూర్తిగా కాలువల పనులు


