MBNR: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై కాంగ్రెస్ అపోహలు సృష్టిస్తోందని జిల్లా ఎంపీ డీకే అరుణ విమర్శించారు. శనివారం బీజేపీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. 13 కోట్ల ఓట్లు తొలగిస్తున్నారన్న రాహుల్ ఆరోపణ అవాస్తవమన్నారు. మృతులు, వలస వెళ్లినవారు, డూప్లికేట్ ఓట్లనే తొలగిస్తున్నారని, అర్హులు ఫామ్-6తో నమోదు చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ
సర్పై కాంగ్రెస్ అపోహలు: డీకే అరుణ


