హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాసవి అమ్మవారిని దర్శించుకున్న కాటసాని

NDL: అవుకులో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి శనివారం రాత్రి పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఏడో రోజు ధనలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అవుకు ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.