హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రైనేజీలో శిశువు మృతదేహం

HNK: హన్మకొండ అమృత థియేటర్‌ నుంచి సుధానగర్‌కు వెళ్లే మార్గంలోని డ్రెయినేజీలో శిశువు మృతదేహం బయటపడటం కలకలం రేపింది. శనివారం మురుగు కాల్వను శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు మృతదేహాన్ని గుర్తించారు. శిశువు బొడ్డుపేగు కూడా కత్తిరించకపోవడంతో అప్పుడే పుట్టిన శిశువును కాల్వలో పడేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. ఘటన పోలీసులు కేసు నమోదు చేశారు.