SRPT: మండలంలోని టేకుమట్ల జాతీయ రహదారి పక్కన ఉన్న బాణసంచా దుకాణంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దుకాణం పైనుంచి హైటెన్షన్ వైర్లు వెళ్తుండటంతో భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్లైఓవర్ పనులతో ట్రాఫిక్ రద్దీ పెరిగిందని వాహనదారులు చెబుతున్నారు. అధికారులు తనిఖీలు నిర్వహించి భద్రతా ప్రమాణాలు పరిశీలించాలని కోరుతున్నారు.
తెలంగాణ
హైటెన్షన్ వైర్ల కింద బాణసంచా దుకాణం..


