జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట వద్ద ఈ నెల 16న రాత్రి బైక్ మారిన ఘటన చోటుచేసుకుంది. శ్రీనగర్ కాలనీకి చెందిన కాసుల శ్రీనివాస్ తన బైక్ను అక్కడ నిలిపి ఉంచగా, మరో వ్యక్తి దానిని తన వాహనంగా భావించి తీసుకెళ్లాడు. తన బైక్ కనిపించకపోవడంతో శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ చేపట్టి శనివారం బాధితుడుకి బైక్ను అప్పగించారు.
తెలంగాణ
12 గంటల్లో బైక్ ఆచూకీ


