మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్వాలియర్లోని చినూర్ రోడ్డులో అదుపుతప్పి షీతలా మాత ఆలయంలోకి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 12 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
వార్తలు
ఘోర ప్రమాదం.. 12 మంది మృతి


