BDK: ఖమ్మం జిల్లా కరువు మండలాల జాబితాలో ఏన్కూరు, కొణిజర్ల, వైరా మండలాలను చేర్చాలని సీపీఎం వైరా డివిజన్ కార్యదర్శి వీరభద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం బోడేపూడి భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. రైతులు, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
కరువు మండలాలుగా ప్రకటించి ఆదుకోవాలి: సీపీఎం


