హైదరాబాద్: 28°C
తెలంగాణ

అకాల వర్షానికి తడిసిన ధాన్యం

SRPT: తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌లో శనివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి విక్రయానికి తీసుకొచ్చిన ధాన్యం తడిసిపోయింది. వారం రోజులుగా ధాన్యం భారీగా వస్తున్నా కొనుగోళ్లు సకాలంలో జరగకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి నిబంధనల ఆంక్షలు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని, అదనపు కాంటాలు ఏర్పాటు చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు