హైదరాబాద్: 28°C
తెలంగాణ

జగదాంబ మాత పాదయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే

ADB: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్రలోని కేలాపూర్ జగదంబ మాత ఆలయం వరకు శనివారం శ్రీ జగదంబ మాత మండలి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన MLA పాయల్ శంకర్ ప్రత్యేక పూజలు చేసి యాత్రను ప్రారంభించారు. గత 32 ఏళ్లుగా ఈ యాత్ర నిర్వహించడం అభినందనీయమన్నారు. భక్తులు 'జై భవానీ, జై మాతాది' నినాదాలతో హోరెత్తించారు.