ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్లో రెండు వీధులను కలిపేందుకు మురుగు కాలువపై కల్వర్టు నిర్మించారు. అయితే కల్వర్టుపై మొరం పోసి చదును చేయకపోవడంతో స్థానికులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. బల్దియా అధికారులు స్పందించి మొరం పోసి రహదారిని అందుబాటులోకి తేవాలని కాలనీవాసులు కోరుతున్నారు.
తెలంగాణ
కల్వర్టుపై మొరం పోయరా.. స్థానికుల అవస్థలు


