హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఈఐఆర్‌ పోర్టల్‌తో మొబైల్‌ ఫోన్లు రికవరీ

NZB: ఆర్మూర్‌ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పోగొట్టుకున్న ఎనిమిది మొబైల్‌ ఫోన్లను సీఈఐఆర్‌ పోర్టల్‌ ద్వారా గుర్తించి బాధితులకు శనివారం అప్పగించినట్లు స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ సీఐ చంద్రశేఖర్‌ రెడ్డి గౌడ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కనుమ నిరూప, తొగర్ల నాగేశ్‌, నరేశ్‌, బీరప్ప, సోవిక్‌, రత్నాబాయి, ధనుంజయ్‌, లింబాద్రికి ఫోన్లను అందజేసినట్లు పేర్కొన్నారు.