హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాణ్యమైన వైద్య సేవలందించాలి: DMHO

BHPL: కాటారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూధన్ శనివారం తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, రికార్డులు, మందుల నిల్వలు, రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని సిబ్బందికి సూచించారు. విధుల పట్ల నిర్వక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.