హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ కోతలు ఆపాలి.. 24 గంటల కరెంట్ ఇవ్వాలి

KMR: మద్నూర్ మండలం రైతులకు గృహ వినియోగ దారులకు 24 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలని బీఆర్ఎస్‌ మండల అధ్యక్షుడు బన్సి పటేల్‌ శనివారం డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో తరచూ విద్యుత్‌ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, మోటార్లు దెబ్బతింటూ పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాలుగోన్నారు.