హైదరాబాద్: 28°C
తెలంగాణ

కారు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

JN: రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి వద్ద శుక్రవారం సాయంత్రం కారు బోల్తాపడిన ఘటనలో తీవ్రంగా గాయపడిన హైదరాబాద్‌కు చెందిన హుస్సేన్ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ప్రమాదం అనంతరం మెరుగైన వైద్యం కోసం అతడిని హైదరాబాద్‌కు తరలించగా,అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భరత్ తెలిపారు.