ADB: జిల్లా కేంద్రంలోని సంజయ్నగర్ కాలనీ పంచముఖి హనుమాన్ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం జరిగిన దుర్గామాత ప్రత్యేక పూజల్లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ప్రార్థించారు.
తెలంగాణ
దుర్గామాత పూజల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్


