హైదరాబాద్: 28°C
తెలంగాణ

కిరాణా షాపు చోరీ కేసులో నిందితుడి అరెస్ట్

నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలోని నల్లగట్టు మారెమ్మ గుడి సమీపంలో ఈ నెల 8న జరిగిన కిరాణా షాపు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. మక్తల్ మండలం చందాపూరు చెందిన పాత నేరస్థుడు నరసింహులు 44ను SI అశోక్ బాబు దర్యాప్తులో భాగంగా బస్టాండ్ వద్ద అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి బంగారు, వెండి ఆభరణాలతో పాటు, రూ.10 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.