హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైలు కిందపడి డిగ్రీ విద్యార్థి మృతి

MHBD: పట్టణంలోని రైల్వే స్టేషన్‌ సమీపంలో రైలు కిందపడి మహమ్మద్‌ సమీర్‌ మృతి చెందాడు. శనివారం పత్తిపాకకు చెందిన సమీర్‌ వరంగల్‌లోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. పండుగ సెలవుల కోసం ఇంటికి వచ్చిన అతడు, హాస్టల్‌కు వెళ్లి దుస్తులు తెచ్చుకుంటానని ఇంటి నుంచి బయలుదేరాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.