హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే జైలుకే'

KKD: నగరంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపితే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని ట్రాఫిక్ వన్ CI నూని రమేశ్ హెచ్చరించారు. శనివారం డ్రంకెన్ డ్రైవ్‌లో నలుగురిని గుర్తించి కాకినాడ కోర్టులో హాజరు పరచగా, వారిని జైలుకు పంపినట్లు తెలిపారు. స్థానిక కల్పనా సెంటర్‌లో ట్రాఫిక్‌పై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.