హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రికెట్లో సత్తాచాటిన గొడ్సారా బాలుడు

NRML: కుబీర్ మండలం గొడ్సారాకు చెందిన హరీతేజ్ శిరిడిలో జరిగిన అండర్-14 క్రికెట్ పోటీల్లో ప్రతిభ చాటాడు. గరుడ క్రికెట్ అకాడమీ తరఫున బరిలోకి దిగి తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. చిన్న వయసులోనే క్రికెట్లో నైపుణ్యంతో రాణించిన హరీతేజ్‌ను గ్రామస్థులు, స్థానిక క్రీడాభిమానులు అభినందించారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.