హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుర్తింపు లేని పాఠశాల సీజ్

KRNL: కల్లూరు మండలం శివప్ప కాలనీలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలను విద్యాశాఖ అధికారులు మూసివేశారు. గతంలో నోటీసులు ఇచ్చినా తరగతులు కొనసాగించడంతో డీఈవో ఆదేశాల మేరకు ఎంఈవో ముద్దనూరు శ్రీనివాసులు చర్యలు తీసుకున్నారు. గుర్తింపు లేని పాఠశాలల్లో పిల్లలను చేర్పించవద్దని, విద్యార్థులను గుర్తింపు పొందిన పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు.