NLG: చింతపల్లి శ్రీ సాయి సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ, హోమం, కుంకుమార్చన నిర్వహించారు. 108 కలశాలతో సాయినాథుడికి అభిషేకం, అనంతరం పార్వతీ కల్యాణం హరికథా గానం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ మంచికంటి ధనంజయతో పాటు కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
తెలంగాణ
ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రి వేడుకలు


