హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు నామినేషన్ వేయనున్న వైసీపీ చైర్మన్ అభ్యర్థి

VZM: నెల్లిమర్ల నగర పంచాయతీ YCP ఛైర్మన్‌ అభ్యర్థిగా సముద్రపు రామారావును అధిష్టానం ఎంపిక చేస్తూ నిన్న రాత్రి పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీచేసింది. ఈయన గతంలో మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌గా సేవలందించారు. ప్రస్తుతం జిల్లా అధికార ప్రతినిధిగా ఉన్నారు. తనకు అవకాశం కల్పించినందుకు అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఆదివారం నామినేషన్ వేస్తానని తెలిపారు.