హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండో రోజు నామినేషన్లు ఎన్నంటే..?

W.G: నరసాపురం మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు ఉత్సాహంగా సాగింది. శనివారం మొత్తం 54 నామినేషన్లు దాఖలయ్యాయి. YSRCP చైర్పర్సన్ అభ్యర్థిగా బర్రె శ్రీ వెంకట రమణ నామినేషన్ సమర్పించారు. పట్టణంలోని 36 వార్డులకు సంబంధించి 53 మంది కౌన్సిలర్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.