హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించిన కలెక్టర్

BPT: మున్సిపల్, పంచాయతీ ఎన్నికల దృష్ట్యా రేపల్లెలోని ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కళాశాలలు, హైస్కూల్‌లోని స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాలను కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా ముందుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, డీఎస్పీ ఉన్నారు.