హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ కుటుంబాల మధ్య బతుకమ్మ కోలాహలం

KMM: ఖమ్మం పోలీస్ పరేడ్ మైదానం పూల పండుగ శోభను సంతరించుకుంది. పోలీస్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో సీపీ సునీల్ దత్, ఆయన సతీమణి నిష్టా శర్మ పాల్గొని గౌరమ్మకు పూజలు చేశారు. మహిళలు సంప్రదాయ పాటలు, కోలాటాలతో సందడి చేశారు. పలువురు పోలీస్ అధికారులు వేడుకల్లో పాల్గొన్నారు. ప్రజలు సంతోషంగా వేడుకలు జరుపుకోవాలని సూచించారు.