హైదరాబాద్: 28°C
తెలంగాణ

వ్యవసాయ మోటార్ల దొంగలకు పోలీసుల చెక్

KMM: పెనుబల్లి మండలం, పొలాల్లో విద్యుత్ మోటార్లు, కేబుళ్లు అపహరించిన ఘటనలపై దర్యాప్తు చేపట్టిన వీఎం బంజారా పోలీసులు ఐదు కేసులను పరిష్కరించారు. ఈ వ్యవహారంలో ఏడుగురిని అరెస్ట్ చేయగా, నలుగురిని రిమాండ్‌కు పంపారు. వారి వద్ద నుంచి ఏడు మోటార్లు, 200 మీటర్ల వైర్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సర్వయ్య, ఎస్సై షకీర్ వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.