హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డుపై వరి నాట్లు వేసి గ్రామస్తుల నిరసన

SRPT: నూతనకల్ మండలంలోని చిల్పకుంట్ల గ్రామంలో రహదారి బురదమయంగా మారడంతో గ్రామస్తులు శనివారం రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. సరైన రహదారి లేక వడ్లు, మిర్చి, పత్తి పంటలను మార్కెట్‌కు తరలించలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర సమయాల్లో 108 అంబులెన్స్ కూడా గ్రామానికి రావడం లేదని ఆరోపించారు.