హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరాకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు: ఎస్పీ

VKB: దసరా సందర్భంగా బతుకమ్మ వేడుకలు, రావణ దహనం, దుర్గామాత విగ్రహాల నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఐపీఎస్ ఆదేశించారు. VKB జిల్లాలో 407 దుర్గామాత విగ్రహాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో నిమజ్జన మార్గాల్లో బారికేడ్లు, ట్రాఫిక్ నియంత్రణ, జలాశయాల వద్ద ప్రత్యేక భద్రత కల్పించాలని సూచించారు.