ASF: వాంకిడి మండల కేంద్రంలో వీధి కుక్కల సంచారం స్థానికులను భయాందోళనకు గురి చేస్తుంది.రాత్రి వేళల్లో కుక్కలు గుంపులుగా తిరుగుతుండటంతో చిన్నారులు, మహిళలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. కుక్కల బెడదతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వీధి కుక్కల సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
తెలంగాణ
వీధి కుక్కల సంచారం.. స్థానికులలో భయాందోళన


