హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్కాడాతో నాణ్యమైన విద్యుత్ సేవలు

NZB: సర్కిల్‌లో విద్యుత్‌ సేవలు మరింత మెరుగుపడనున్నాయని ట్రాన్స్‌కో SE రాజేశ్వర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. సర్కిల్‌ పరిధిలో 139 సబ్‌స్టేషన్లను స్కాడా వ్యవస్థతో అనుసంధానం చేయగా, మరో 20 సబ్‌స్టేషన్ల పనులు కొనసాగుతున్నాయన్నారు. విద్యుత్‌ అంతరాయాలు, ఓవర్‌లోడ్‌,వోల్టేజ్‌ హెచ్చుతగ్గులపై రియల్‌టైమ్‌ అలర్టులు అందడంతో సమస్యలను వేగంగా పరిష్కరించవచ్చన్నారు.