KNR: కరీంనగర్లో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నిన్న ఏడో రోజు మహాదుర్గ అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పలు డివిజన్లలోని దుర్గామాత మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారి పల్లకీ సేవలో పాల్గొని నగర ప్రజల సుఖసంతోషాల కోసం ప్రార్థించారు.
తెలంగాణ
దుర్గామాత పల్లకీ సేవలో పాల్గొన్న మేయర్


