హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరెన్సీ నోట్లతో మెరిసిన దుర్గాదేవి మండపం

మెదక్ 24వ వార్డు శ్రీ దేవీ మహంకాళి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. ఏడో రోజు అమ్మవారు మహాలక్ష్మి దేవిగా దర్శనమిచ్చారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు శివశేఖర్ లక్ష రూపాయల నగదుతో మండపాన్ని మనోహరంగా అలంకరించారు. ఈ దివ్య మంగళ స్వరూపాన్ని తిలకించేందుకు భక్తులు విశేషంగా తరలివచ్చారు.