హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ స్థాయి పోటీలకు ఫరీద్‌పేట యువతి

KMR: పాల్వంచలోని ఫరీద్‌పేటకి చెందిన శ్రావ్యరెడ్డి వెస్ట్‌జోన్‌ యూనివర్సిటీ నేషనల్స్‌కు ఎంపికైంది. మధ్యప్రదేశ్‌లోని జీవాజీ యూనివర్సిటీ జట్టు తరఫున ఆమె పోటీల్లో పాల్గొననుంది. నవంబరు 2 నుంచి 5 వరకు రాజస్థాన్‌లోని జైపూర్‌లో పోటీలు జరగనున్నాయి. ఈవిషయాన్ని ఆమె తండ్రి సంతోష్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.