హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 23 నుంచి అగ్రి గోల్డ్ బాండ్లు పరిశీలన

VZM: డెంకాడ మండల అగ్రిగోల్డ్ డిపాజిటర్ల బాండ్లను ఈనెల 23 నుంచి 31 వరకు పరిశీలించనున్నట్లు విశాఖ సీఐడీ డీఎస్పీ వి.చంద్రశేఖర్ తెలిపారు. కంటోన్మెంట్ పోలీసు లైన్స్‌లోని సీఆర్పీఎఫ్ బ్యారక్ వద్ద పరిశీలన ఉంటుందన్నారు. ఒరిజినల్ బాండ్, కలర్ జిరాక్స్, బ్యాంకు ఖాతా మొదటి పేజీ, ఆధార్, పాన్ కార్డు, బ్యాంకు ఖాతాకు లింకైన ఫోన్ నంబర్ తీసుకురావాలని సూచించారు.