హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీసులకు 40 ల్యాప్‌టాప్‌ల విరాళం

ATP: ఫోర్టినెట్ సంస్థ జిల్లా పోలీసులకు రూ. 20 లక్షల విలువైన 40 ల్యాప్‌టాప్‌లను విరాళంగా అందజేసింది. SP జగదీశ్‌కు ఫోర్టినెట్ ఎండీ కిషోర్, ఏజీఎస్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అనిల్ కుమార్ ల్యాప్‌టాప్‌లను అందించారు. వీటిని సైబర్ క్రైమ్ విభాగం బలోపేతానికి, రక్షక్ స్కూల్‌లో డిజిటల్ విద్య కోసం వినియోగించనున్నట్లు SP తెలిపారు.