హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు పైడితల్లి అమ్మవారు పండగ చాటింపు

విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలేళ్లు, సిరిమాను ఉత్సవం ఈనెల 26, 27 తేదీల్లో జరగనున్నాయి. ఆనవాయితీ ప్రకారం 9 రోజుల ముందు చాటింపు వేస్తారు. ఈ చాటింపు కార్యక్రమాన్ని ఇవాళ సాయంత్రం 4 గంటలకు దేవస్థానం నిర్వహించనుంది. అనంతరం భక్తులు తమ బంధువులు, స్నేహితులను పండగకు ఆహ్వానించుకుంటారని ఆలయ వర్గాలు తెలిపాయి.