హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి విశాఖ-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు

VSP: దసరా రద్దీ దృష్ట్యా దక్షిణ కోస్తా రైల్వే విశాఖ-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనుంది. సికింద్రాబాద్-విశాఖ (07071) 18న రాత్రి 8.15కు బయలుదేరి మరుసటి రోజు 12.05కు విశాఖ చేరుతుంది. విశాఖ-సికింద్రాబాద్ (07072) 19న మధ్యాహ్నం 3.50కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.05కు సికింద్రాబాద్ చేరుతుంది. ఈ రైలు 22 బోగీలతో నడుస్తుందని అధికారులు తెలిపారు.