హైదరాబాద్: 28°C
తెలంగాణ

గూడ్స్ రైలు డ్రైవర్‌కు అస్వస్థత

MHBD: డోర్నకల్ నుంచి కాజీపేటకు వెళ్తున్న గూడ్స్ రైలు డ్రైవర్ జి.శ్రీనివాస్‌కు ఒక్కసారిగా ఛాతినొప్పి రావడంతో కేసముద్రం రైల్వే స్టేషన్లో రైలు నిలిపివేశారు. వెంటనే అప్రమత్తమైన మరో డ్రైవర్ 108కు సమాచారం అందించగా, గూడూరు నుంచి అంబులెన్స్ చేరుకుంది. స్థానిక యువకుల సహాయంతో బాధితుడిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.