హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్కార్పియోకు నిప్పు.. మరోసారి ఉద్రిక్తత..!

కడప: నగరంలోని గాంధీనగర్ హైస్కూల్ వద్ద మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఉదయం టీడీపీ, వైసీపీ నేతల మధ్య రాళ్లదాడిలో కొన్ని కార్లు ధ్వంసమైనట్లు సమాచారం. వాటిలో ఒక స్కార్పియోకు సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.